hari babu: తప్పేముంది?... మోదీని విజయసాయిరెడ్డి కలవడంపై బీజేపీ ఎంపీ హరిబాబు

  • మోదీని విజయసాయిరెడ్డి కలవడంలో తప్పు లేదు
  • ప్రధానిని ఎంపీలు కలవడం సాధారణ విషయమే
  • విశాఖ రైల్వే జోన్ వస్తుంది
జగన్ ను కేసుల నుంచి తప్పించడం కోసం ప్రధాని కార్యాలయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుగుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు మాట్లాడుతూ మోదీని విజయసాయిరెడ్డి కలవడంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు. ప్రధానిని ఎంపీలు కలవడం సాధారణ విషయమేనని చెప్పారు. టీడీపీ నేతలు ఎలాంటి అపోహలు పెట్టుకోరాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు. త్వరలోనే విశాఖ రైల్వే జోన్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
hari babu
Vijay Sai Reddy
Narendra Modi

More Telugu News