పవన్‌పై ఎంఎల్ఏ జలీల్ ఖాన్ గరంగరం
- చంద్రబాబు సర్కార్‌పై పవన్ ఆరోపణలపై అనుమానాలను వ్యక్తం చేసిన ఎంఎల్ఏ
- పవన్‌కు స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో చెప్పాలంటూ డిమాండ్
- అవిశ్వానికి జాతీయ పార్టీలు మద్దతివ్వడం బాబు విశ్వసనీయతకు నిదర్శనమని వెల్లడి
అయితే వైసీపీ అవిశ్వాసాన్ని ఆయన ఓ డ్రామాగా అభివర్ణించారు. మంగళగిరిలో జరిగిన తన పార్టీ ఆవిర్భావ సభలో విజయవాడ కనకదుర్గ గుడి పార్కింగ్ వ్యవహారానికి సంబంధించి ఎంఎల్ఏ నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారంటూ పవన్ ఆరోపించిన నేపథ్యంలో జలీల్ ఖాన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా గుంటూరులో అతిసార వ్యాధితో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ బాబు సర్కార్‌పై పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. రాజకీయాలు ప్రజల కోసం చేయాలని ఆయన హితవు పలికారు.