Chandrababu: రేపోమాపో జగన్ కేసులన్నీ కొట్టేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది: చంద్రబాబు

  • ప్రధాని కార్యాలయంలో విజయసాయిరెడ్డి, ఇతర నేతలు తిరుగుతున్నారు
  • కేసులు కొట్టేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది
  • ఇప్పుడు దేశం మొత్తం మన వైపే చూస్తోంది
వైసీపీ అధినేత జగన్ కేసులను కొట్టేయించడం కోసమే ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర నేతలు ప్రధాని కార్యాలయంలో తిరుగుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దానికి ప్రతిఫలంగానే కేసులలో జగన్ కు సడలింపులు వస్తున్నాయని చెప్పారు. రేపోమాపో జగన్ కేసులన్నింటినీ కొట్టివేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో ఈరోజు ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యమని చెప్పారు. జాతీయ స్థాయిలో మన గొంతుకను వినిపించామని... ఇప్పుడు యావత్ దేశం మనవైపే చూస్తోందని చెప్పారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని మార్గనిర్దేశం చేశారు.
Chandrababu
jagan
Vijay Sai Reddy
cases

More Telugu News