charan: నా కెరియర్లో నేను చేసిన బెస్ట్ మూవీ రంగస్థలమే: చరణ్

  • 'రంగస్థలం' ఆడియన్స్ ను నిరుత్సాహ పరచదు 
  • నటన పరంగా నాకు సంతృప్తిని ఇచ్చింది 
  • ఈ సినిమాను తప్పకుండా చూడండి       
చరణ్ .. సమంత కాంబినేషన్లో 'రంగస్థలం' రూపొందుతోంది. చాలాకాలం తరువాత గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న పెద్ద సినిమా ఇది. ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక వేదికపై చరణ్ ఈ సినిమాను గురించి ప్రస్తావించాడు.

"ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం .. ఎవరూ నిరుత్సాహ పడకుండగా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని గట్టిగా చెప్పగలను. ఇంతవరకూ నా కెరియర్లో చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ మూవీ అని చెప్పగలను. నటన పరంగా కూడా నాకు బాగా సంతృప్తిని కలిగించిన పాత్ర ఇది. ఎప్పుడూ కూడా నా సినిమా చూడమని ఎవరికీ చెప్పలేదు .. కానీ ఇప్పుడు చెబుతున్నాను .. ఈ సినిమాను తప్పకుండా చూడండి'' అన్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18వ తేదీన వైజాగ్ లో జరగనున్న సంగతి తెలిసిందే.
charan
samanta

More Telugu News