Chandrababu: చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలి: ఉండవల్లి

  • చంద్రబాబు సెల్ఫ్ డిఫెన్స్ లో పడరాదు
  • ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరపాలి
  • అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలను సాధించే క్రమంలో చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు... ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫ్ డిఫెన్స్ లో పడకూడదని అన్నారు. లోక్ సభలో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వివిధ పార్టీల మద్దతును కూడగట్టాలని చెప్పారు.

జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడం కోసం... ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరపాలని అన్నారు. ఏపీకి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ... కేవలం 2 శాతం ఓట్లకు మాత్రమే పరిమితమైందని... రాబోయే రోజుల్లో బీజేపీకి కూడా అదే గతి పట్టబోతుందనే గట్టి సంకేతాలు ఢిల్లీకి వెళ్లాలని చెప్పారు. బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటలను 90 శాతం మంది ప్రజలు విశ్వసించారని తెలిపారు. పవన్ తో తన సంబంధం జేఎఫ్సీ వరకే పరిమితమని చెప్పారు. 
Chandrababu
Undavalli

More Telugu News