Nani: కొరటాలతోనే నాని మూవీ ఖరారయ్యే ఛాన్స్?

  • ముగింపు దశలో 'భరత్ అనే నేను'
  • కొరటాల తరువాత సినిమా నానితో 
  • నిర్మాతలుగా కొరటాల మిత్రులు
కొరటాల శివ తన సినిమాల్లో వినోదంతో పాటు సందేశం కూడా ప్రధానంగా ఉండేలా చూసుకుంటూ వుంటారు. ఇంతవరకూ ఆయన స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. అలాంటి కొరటాల .. త్వరలో నానితో సినిమా చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. ఎక్కువగా యువ దర్శకులతోను .. కొత్త దర్శకులతోను నాని సినిమాలు చేస్తూ వచ్చాడు.

కథ .. కథనాలు .. ఆయా దర్శకులపై ఉంచిన నమ్మకం ఆయనకి వరుస విజయాలను అందించాయి. అలాంటి నాని కొరటాల దర్శకత్వంలో చేయడానికి ఆసక్తిని చూపుతున్నాడట. స్టార్ హీరో స్టేటస్ కి దగ్గరలో వున్న నానితో సినిమా చేయడానికి కొరటాల కూడా ఆసక్తిని చూపుతున్నాడని సమాచారం. కొరటాల మిత్రులే ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారని అంటున్నారు.    
Nani
Koratala Siva

More Telugu News