2019 ఎన్నికల్లో బీజేపీ నంబర్ 100-110 దగ్గరే ఆగిపోతుంది: శివసేన జోస్యం
- యూపీలో ఏడాది క్రితమే ఘన విజయం
- ఇంతలోనే వారి కోటకు బీటలు పడ్డాయేమి?
- ప్రజలు అన్నీ చూస్తున్నారని వ్యాఖ్య
"ఏడాది క్రితమే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మరి అంతలోనే వారి కోటకు బీటలు పడ్డాయేమి?’’ అని ప్రశ్నించింది. ‘‘2014లో ప్రచార హోరు సామాన్య ప్రజల కళ్లు, చెవులను కప్పేసింది. దాంతో బీజేపీ విజయం సాధ్యమైంది. కానీ, ఇప్పుడు అదంతా కరిగిపోయింది. ప్రజలు ప్రతిదీ స్పష్టంగా చూస్తున్నారు’’ అని సంపాదకీయంలో పేర్కొంది.