Asaduddin Owaisi: మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నాం: అసదుద్దీన్ ఒవైసీ

  • రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చకపోవడం ఒక్కటే కారణం కాదు
  • ముస్లిం మహిళలను, మైనార్టీలను మోదీ మోసం చేశారు
  • యువతకు ఉద్యోగాలు కల్పించలేదు
కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాలకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీపై అనుక్షణం నిప్పులు చెరిగే ఒవైసీ తమ అంతరంగాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాల్సిందేనని ఆయన అన్నారు.

అయితే, ఈ ఒక్క కారణం గురించే తాము అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. ముస్లిం మహిళలకు, మైనార్టీలకు మోదీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, యువతకు ఉద్యోగాలను కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయిందని... ఈ నేపథ్యంలో కూడా తాము అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నామని అన్నారు. 
Asaduddin Owaisi
no confidence motion
Narendra Modi
NDA
support

More Telugu News