Pawan Kalyan: బొక్కలున్న మీకు భయమేమో... నాకు కాదు: పవన్ కల్యాణ్

  • నిన్నటిదాకా టీడీపీ మనిషినన్నారు
  • ఇప్పుడు బీజేపీ వాడినంటున్నారు
  • తాను భయపడబోనన్న పవన్ కల్యాణ్
తన వెనుక బీజేపీ ఉందని, ఆ పార్టీ నేతల ప్రమేయంతోనే తాను టీడీపీని విమర్శించానని జరుగుతున్న ప్రచారంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. మొన్నటి దాకా తనను టీడీపీ మనిషినని అన్నారని గుర్తు చేసిన పవన్ ఇప్పుడేమో బీజేపీ మనిషినని అంటున్నారని, బొక్కలు, లొసుగులు ఉన్న టీడీపీ వారు కేంద్రానికి భయపడతారేమో తప్ప, తాను ఎవరికీ భయపడబోనని, తలొగ్గనని స్పష్టం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పవన్ ఓ ట్వీట్ ఉంచారు. నేడు ఉదయం 11.22 గంటలకు పవన్ పెట్టిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి రీ ట్వీట్లు కూడా వందల సంఖ్యలో వస్తున్నాయి.
Pawan Kalyan
Telangana
Jana Sena
Twitter

More Telugu News