Guntur District: గుంటూరులో ఆందోళన కలిగిస్తోన్న అతిసార సమస్య.. ఇప్పటికి 15 మంది మృతి

  • ఇటీవల కలుషిత నీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన గుంటూరు నగరపాలక సంస్థ ప్రాంతవాసులు
  • గుంటూరులోని సర్వజన ఆసుపత్రిలో మొత్తం 90 మందికి చికిత్స
  • ఆందోళనలో స్థానికులు
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అతిసార వ్యాధి శరవేగంగా వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఆ ప్రాంతవాసులు కలుషిత నీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందిన వారి సంఖ్య ఈ రోజు ఉదయం నాటికి 15కి చేరింది. గుంటూరులోని సర్వజన ఆసుపత్రిలో అతిసార సమస్యతో బాధపడుతూ మొత్తం 90 మంది చికిత్స పొందుతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన వారు అధికంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కొన్ని రోజుల నుంచి అతిసార సమస్యతో కొత్తగా ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య తగ్గింది. అయితే, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.
Guntur District
Andhra Pradesh

More Telugu News