Uttar Pradesh: ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ.. రాహుల్ గాంధీ స్పందన

  • ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి
  • బీజేపీతో ప్రజలు విసిగిపోయారు- రాహుల్ గాంధీ
  • ఈ విషయం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తోంది
  • యూపీలో మా పార్టీ పునర్మిర్మాణానికి కట్టుబడి ఉన్నాం
ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. బీహార్‌లోని అరారియా లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీపై 57,358 ఓట్ల అధిక్యంతో ఆర్జేడీ అభ్యర్థి విజయం సాధించగా, యూపీలోని గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ విజయం సాధించింది. ఈ ఫలితాలపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... బీజేపీతో ప్రజలు విసిగిపోయారనే విషయం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తోందని అన్నారు.

బీజేపీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని రాహుల్ గాందీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశం ఉన్న బీజేపీయేతర అభ్యర్థులకే ఓటర్లు పట్టంకట్టారని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ పునర్మిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని, కాకపోతే ఇది రాత్రికి రాత్రే జరిగే పని కాదని తెలిపారు.  
Uttar Pradesh
bihar
Rahul Gandhi

More Telugu News