Chandrababu: ఆ ఇద్దరూ ‘నంది’, ‘ఆస్కార్’ స్థాయి నటనతో ప్రజలను మోసం చేస్తున్నారు : ఎంపీ కేవీపీ

  • చంద్రబాబు, మోదీలపై మండిపడ్డ కాంగ్రెస్ నేత కేవీపీ
  • ఏపీ ప్రయోజనాలను వాళ్లిద్దరూ కాలరాస్తున్నారు
  • లెక్కలు చెప్పమన్నందుకే బీజేపీని టీడీపీ వ్యతిరేకిస్తోంది : కేవీపీ
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరుగుతోందని, సీఎం చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోదీలు తమ నటనతో రాష్ట్ర  ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నంది అవార్డు స్థాయి నటనతో చంద్రబాబు, ఆస్కార్ అవార్డు స్థాయి నటనను మోదీ ప్రదర్శిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఏపీ ప్రయోజనాలను కాలరాసేలా చంద్రబాబు, మోదీ వ్యవహరిస్తున్నారని కేవీపీ మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం నిధులు కావాలని ఇన్నేళ్లుగా కేంద్రాన్ని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఏపీకి తాము ఇచ్చిన నిధుల లెక్కలు చెప్పమని కేంద్రం అడుగుతున్నందువల్లే బీజేపీని టీడీపీ వ్యతిరేకిస్తోందని కేవీపీ విమర్శించారు.
Chandrababu
modi
kvp

More Telugu News