ఫైనల్ లో బెర్తు కోసం టీమిండియా, బంగ్లాదేశ్ పోరాటం
- రెండు టీ20 మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా
- ఒక టీ20 మ్యాచ్ లో విజయం సాధించిన బంగ్లాదేశ్
- నేటి మ్యాచ్ లో విజయంపై రెండు జట్లకు ఆశ
దీంతో ప్రయోగాలకు పోకుండా గత మ్యాచ్ లో ఆడిన జట్టునే టీమిండియా బరిలో దించాలని భావిస్తోంది. ఫాంలో లేని రోహిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి, లోకేష్ రాహుల్ ను ఓపెనర్ గా పంపాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక ప్రధాన బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ధారాళంగా పరుగులివ్వడం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. శార్థుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్, శంకర్, చాహల్ రాణిస్తుండడంతో టీమిండియా బౌలింగ్ విభాగంలో ఫర్వాలేదనిపిస్తోంది. మరోవైపు భారత్ ను ఓడించాలన్న లక్ష్యంతో ముష్ఫికర్ బృందం బరిలో దిగనుంది. ఆతిథ్య శ్రీలంకతో మ్యాచ్ లో విజయం సాధించిన ఉత్సాహంతో ఆ జట్టు బరిలో దిగుతోంది. తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్ లపై ఆ జట్టు భారమేసింది. ఇప్పటికే నిరూపించుకున్న ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్, స్పిన్నర్ మెహదీ హసన్ లు రాణించాలని బంగ్లాదేశ్ కోరుకుంటోంది.