'ఛలో' మూవీ నానీకి నచ్చేసింది .. ఆయన కోసం కథ రెడీ చేస్తోన్న వెంకీ కుడుముల

  • వరుస సినిమాలతో నాని
  • ఆయనను కలవనున్న 'ఛలో' దర్శకుడు
  • నిర్మాణానికి సిద్ధంగా వున్న పెద్ద బ్యానర్   
ఇటీవల వచ్చిన 'ఛలో' సినిమా భారీ విజయాన్ని సాధించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, నాగశౌర్య కెరియర్లోనే భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా నానికి కూడా బాగా నచ్చేసిందట. యూత్ కి కావలసిన కంటెంట్ ను ఎంచుకుని దానిని కనెక్ట్ చేసినతీరు కరెక్ట్ గా ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో నానితో సినిమా చేయాలనే ఉద్దేశంతో వెంకీ కుడుముల వున్నాడట. నాని క్రేజ్ కి తగిన కథను సిద్ధం చేసుకుని, ఆయనకి వినిపించడానికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు. ఈ కాంబినేషన్లో సినిమా చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఆసక్తిని చూపుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే నాని చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు వున్నాయి. వెంకీ కుడుములతో సినిమాకి నాని ఏమంటాడో చూడాలి మరి.
Go Back to Shorts
nani
venky kudumula

More Telugu News