gopichand: పవన్ 'నో' చెప్పడంతో మరో హీరోతో 'కందిరీగ' దర్శకుడు

  • సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గోపీచంద్ 
  • నిర్మాతగా బీవీఎస్ ఎన్ ప్రసాద్ 
  • ఈ నెల 18వ తేదీన ప్రారంభం      
'కందిరీగ' సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న దర్శకుడు సంతోశ్ శ్రీనివాస్, ఆ తరువాత ఆ స్థాయి సక్సెస్ ను సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన పవన్ తో ఒక సినిమా చేయడానికిగాను రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. మంచి కథను సిద్ధం చేసుకుని పవన్ గ్రీన్ సిగ్నల్ కోసం చాలా రోజుల పాటు ఎదురుచూశాడు.

 వేరే హీరోతో ముందుకెళ్లమని ఆయనకి పవన్ చెప్పినట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. దాంతో ఆయన తన తదుపరి సినిమా హీరోగా గోపీచంద్ ను ఎంచుకున్నట్టు సమాచారం. బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. 'ఉగాది' పండుగ సందర్భంగా ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను ఆ రోజున వెల్లడించే అవకాశం వుంది. 
gopichand
santhosh srinivas

More Telugu News