Kamal Haasan: మౌనమే రజనీకాంత్ సమాధానం: కమల్ కీలక వ్యాఖ్యలు

  • పూర్తి స్థాయి రాజకీయాల్లో కమల్ హాసన్
  • కావేరీ వివాదంపై మాట్లాడరేంటి?
  • రజనీకాంత్ మాట్లాడాలన్న కమల్
మక్కల్ నీది మయ్యమ్ పేరిట రాజకీయ పార్టీని స్థాపించడం ద్వారా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన నటుడు కమల్ హాసన్, తన సమకాలీకుడు, రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్న రజనీకాంత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా విషయాల్లో రజనీకాంత్ మౌనంగానే ఉంటున్నారని, ఆయన ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదని అన్నారు. కావేరీ వివాదం సహా ఎన్నో అంశాల్లో తన అభిప్రాయం ఏమిటన్న విషయాన్ని ఆయన చెప్పడం లేదని ఆరోపించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం వచ్చినప్పుడు కూడా రజనీ, నిరసనల్లో పాల్గొనలేదని అన్నారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఆయన, రజనీ తన అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరారు. తమిళులకు అనుకూలంగా వ్యవహరించాల్సిన విషయాల్లో రజనీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. 
Kamal Haasan
Rajani Kant
Tamilnadu
Kaveri

More Telugu News