బీజేపీపై నిప్పులు చెరిగిన టీడీపీ నేత సోమిరెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీపై నిప్పులు చెరిగిన టీడీపీ నేత సోమిరెడ్డి

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయే దాకా మీకు నిద్రపట్టలేదు
  • ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడిగితే నవ్యాంధ్రను మళ్లీ రెండు రాష్ట్రాలు చేస్తామని అంటారా?
  • బీజేపీకి కనికరం లేదా? మనసు లేదా? మానవత్వం లేదా?
  • బీజేపీపై మండిపడ్డ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రాజకీయ ప్రయోజనాల కోసం నవ్యాంధ్ర ప్రదేశ్ ను రెండుగా విడగొట్టేందుకు సిద్ధపడతారా అంటూ బీజేపీపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మీ (బీజేపీ) రాజకీయ ప్రయోజనాల కోసం ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయే దాకా మీకు నిద్రపట్టలేదు.. రెండు రాష్ట్రాలు అయిపోయింది!  ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమతో ఏర్పడ్డ నవ్యాంధ్రలో పదమూడు జిల్లాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఉండేందుకు ఈరోజుకీ స్ట్రగుల్ అవుతున్నాం.. ప్రయత్నం చేస్తున్నాం. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడిగితే..రాయలసీమలో కూర్చుని మళ్లీ రెండు రాష్ట్రాలు ఇస్తామని మీరు (బీజేపీ) అంటారా? రాయలసీమను ఒక రాష్ట్రం చేసేస్తామంటూ మళ్లీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారా? మీకు (బీజేపీ) కనికరం లేదా? మనసు లేదా? మానవత్వం లేదా? నవ్యాంధ్రను రెండు రాష్ట్రాలుగా చేసేందుకు సిద్ధపడతారా? న్యాయమా ఇదా? రాజకీయాల్లో విలువలు లేవా? ఇది నైతికత?మీ (బీజేపీ) రాజకీయాలకు అనుగుణంగా రాకపోతే మా రాష్ట్రాన్ని మీరు ఏమైనా చేసేస్తామనే దానికి దిగజారిపోతారా? ప్రజల గురించి ఆలోచించరా? ఇది చాలా దురదృష్టకరం. ఇదేనా మీ (బీజేపీ) సిద్ధాంతం? దశాబ్దాలుగా మీ పార్టీ ఉంది. ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్లు. ఈరోజున, ఇంతగా మీరు (బీజేపీ) దిగజారి పోతారా? రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తామంటున్న మీ (బీజేపీ) వాళ్లను ప్రశ్నించే బాధ్యత మీకు  (బీజేపీ) లేదా? ఎవరికైనా ఏ రాజకీయ పార్టీకైనా అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ, పద్ధతులు, సంస్కారాలు..మర్చిపోకూడదు.. అది గుర్తుపెట్టుకోండి’ అని బీజేపీపై సోమిరెడ్డి నిప్పులు చెరిగారు. 
somireddy
Telugudesam
bjp
Andhra Pradesh

More Telugu News