Andhra Pradesh: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది: ఎంపీ హరిబాబు

  • ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది
  • బీజేపీ వల్లే రాష్ట్రంలో గణనీయ అభివృద్ధి జరిగింది
  • ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అమలు చేస్తున్నాం
  • ఏపీకి ఇంకా ఏం కావాలని కేంద్రం అడిగితే స్పందన లేదు : హరిబాబు
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుందని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం అనంతరం విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, బీజేపీ వల్లే రాష్ట్రంలో గణనీయ అభివృద్ధి జరిగిందనే విషయాన్ని ఆత్మవిశ్వాసంతో చెప్పగలనని, ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అమలు చేస్తున్నామని, రాష్ట్రానికి ఇంకా ఏం కావాలని కేంద్ర ప్రభుత్వం అడిగితే ఇప్పటికీ స్పందన లేదని విమర్శించారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని, మోదీ నాయకత్వాన్ని బలపరిచేవారు, దేశాభివృద్ధిని కోరుకునే వారిని ఆహ్వానిస్తున్నామని అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనే విషయాలను ప్రజలకు వివరిస్తామని, క్షేత్ర పర్యటనల ద్వారా ప్రజలకు చెబుతామని, రాష్ట్ర అభివృద్ధిపై అసెంబ్లీలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని చెప్పారు.
Andhra Pradesh
bjp
hari babu

More Telugu News