prakash raj: ప్రకాశ్ రాజ్ కు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ టికెట్?

  • మోదీపై ఇటీవలి కాలంలో విరుచుకుపడుతున్న ప్రకాశ్ రాజ్
  • ప్రకాశ్ కు రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరిన సాహితీవేత్తలు
  • అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లిన సిద్ధరామయ్య
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవలి కాలంలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ఆయన తూటాల వర్షం కురిపిస్తున్నారు. బహిరంగ కార్యక్రమాల్లో సైతం మోదీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ టికెట్ ఇవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సాహితీవేత్తలు విన్నవించారు. ప్రకాష్ రాజ్ కు టికెట్ ఇస్తే కాంగ్రెస్ కు మైలేజ్ పెరుగుతుందని ఇటీవల సిద్ధూకు వారు చెప్పారట. ఇదే విషయాన్ని సిద్ధరామయ్య కూడా పార్టీ అధిష్ఠానం వద్ద లేవనెత్తారని సమాచారం. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. 
prakash raj
Rajya Sabha
sidharamaiah

More Telugu News