నామినేషన్ వేసిన జయాబచ్చన్
- రాజ్యసభ ఎన్నికలకు జయ నామినేషన్
- సమాజ్ వాదీ పార్టీ నుంచి మరోసారి ఎన్నికల బరిలోకి
- జయ వెంట డింపుల్ యాదవ్, సబ్రతారాయ్
నామినేషన్ అనంతరం జయా బచ్చన్ మీడియాతో మాట్లాడుతూ, ములాయం సింగ్ యాదవ్ కు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. కిరణ్మయ్ నందా, నరేష్ అగర్వాల్ లాంటి సీనియర్లను కాదని మీకు పార్టీ టికెట్ ఎలా దక్కిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... తాను కూడా సీనియర్ నే అని చెప్పారు. ఏప్రిల్ 2వ తేదీతో ఆమె రాజ్యసభ ఎంపీ కాలపరిమితి ముగుస్తోంది. ఉత్తర ప్రదేశ్ నుంచి 10 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి.