పేరున్న పత్రిక అలా వ్యవహరిస్తుందని భావించలేదు... ఫేక్ ఇంటర్వ్యూపై అనుష్కశర్మ సీరియస్!
- ఫిబ్రవరి 20న ఇన్ స్టా గ్రాంలో రొమాంటిక్ ఫొటో పోస్టు చేసిన కోహ్లీ
- వైరల్ గా మారిన ఫోటో
- ఆ ఫొటోపై అనుష్క ఇంటర్వ్యూ ఇచ్చిందన్న ఈ-సమయ్ పత్రిక
ఇక వైరల్ గా మారిన ఆ ఫోటోపై అనుష్క తమకు ఇంటర్వ్యూ ఇచ్చిందంటూ ఈ-సమయ్ అనే ఓ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిపై ట్విట్టర్ మాధ్యమంగా అనుష్క మండిపడింది. ఆ పత్రిక ప్రచురించింది ఫేక్ ఇంటర్వ్యూ అని చెప్పింది. దానిని చూసి తాను షాక్ తిన్నానని, పేరున్న పత్రిక అలా వ్యవహరిస్తుందని తాను భావించలేదని అనుష్క ట్వీట్ చేసింది. తన వ్యక్తిగత జీవితంపై ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదని తేల్చి చెప్పింది.