Telugudesam: పార్టీ ముఖ్య నేతలను తన ఇంటికి పిలిపించుకున్న చంద్రబాబు!

  • మరికాసేపట్లో మంత్రులతో భేటీ
  • ఇప్పటికే చేరుకున్న యనమల, కాలువ శ్రీనివాసులు
  • ఎన్డీయేలో కొనసాగాలా? వద్దా?
  • చర్చించనున్న టీడీపీ నేతలు
అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలు వెంటనే తన ఇంటికి రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నుంచి పిలుపు అందడంతో పలువురు నేతలు ఉండవల్లి చేరుకుంటున్నారు. మరికాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్న చంద్రబాబు, గత రెండు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేంద్రంపై తదుపరి దశలో ఎలా వ్యవహరించాలన్న విషయమై చర్చిస్తారని తెలుస్తోంది.

ఇప్పటికే మంత్రులు యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు తదితరులు ఉండవల్లి చేరుకున్నారు. కేంద్ర మంత్రుల రాజీనామా, ప్రధాని ఫోన్ అనంతర పరిణామాలను విశ్లేషించనున్న టీడీపీ నేతలు, ఎన్డీయేలో కొనసాగాలా? వద్దా? అనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కుటుంబరావు తదితర నేతలు కూడా హాజరు కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Telugudesam
Yanamala
Chandrababu
Kinjarapu Acchamnaidu

More Telugu News