Jana Sena: గుంటూరు జనసేన నేతపై పోలీసు కేసు నమోదు

  • జనసేన నేత గోపాళం రామస్వామి
  • మరో పార్టీ నేత ఇంటిపై దాడి
  • రామస్వామి దంపతులు దౌర్జన్యం చేశారన్న రామకోటేశ్వరరావు
  • కేసు రిజిస్టర్ చేసిన గుంటూరు టౌన్ పోలీసులు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గుంటూరు జిల్లా నేత గోపాళం రామస్వామి, ఆయన భార్య లక్ష్మీకళ దంపతులపై పోలీసు కేసు నమోదైంది. గుంటూరు పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, జనసేన పార్టీలో స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

 ఈ నేపథ్యంలో జనసేనకే చెందిన పూల రామకోటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటిపైకి దూసుకెళ్లిన రామస్వామి, ఆయన భార్య దౌర్జన్యం చేశారు. దీనిపై రామకోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఫిర్యాదును విచారించామని, ప్రాథమిక ఆధారాలు లభించడంతో రామస్వామి దంపతులపై కేసును రిజిస్టర్ చేశామని వెల్లడించారు.
Jana Sena
Guntur District
Gopalam Ramaswami
Pawan Kalyan

More Telugu News