Chandrababu: బీజేపీతో తెగదెంపులు?.. సచివాలయంలో తమ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం

  • మంత్రులందరూ వెంటనే సచివాలయానికి రావాలని చంద్రబాబు ఆదేశం
  • ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్‌
  • మీడియా సమావేశం కాస్త ఆలస్యం
  • జైట్లీ ప్రకటనపై అభిప్రాయం తెలపడానికి కాసేపట్లో మీడియా ముందుకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో జరుగుతోన్న పరిణామాలు, ఈ రోజు అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనపై సమీక్షించడానికి చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలతో కీలక చర్చలు జరుపుతున్నారు.

మంత్రులందరూ వెంటనే సచివాలయానికి రావాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు చంద్రబాబు ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. దీంతో ఆయన ఏర్పాటు చేయాలనుకున్న మీడియా సమావేశం కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. జైట్లీ ప్రకటనపై అభిప్రాయం తెలపడానికి, తాము ఇకపై ఎలా ముందుకు వెళ్లనున్నామన్న విషయాన్ని చెప్పడానికి మరికొన్ని నిమిషాల్లో చంద్రబాబు మీడియా ముందుకు రానున్నారు. బీజేపీతో చంద్రబాబు తెగదెంపులు చేసుకుంటారా? అన్న ఉత్కంఠ నెలకొంది.
Chandrababu
Andhra Pradesh
Special Category Status

More Telugu News