Undavalli: కేంద్రం తీరుపై మండిపడ్డ ఉండవల్లి అరుణ్ కుమార్

  • కేంద్రం పాత పాటే పాడటం సబబు కాదు
  • హోదా గురించి అడుగుతుంటే వెటకారంగా లెక్కలు చెబుతారా?
  • ఏపీలో ఏ పార్టీ గెలిచినా మద్దతిస్తారనే ధైర్యంతో బీజేపీ ఉంది
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాతపాటే పాడటంపై సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు వస్తాయని భావిస్తుంటే కేంద్రం పాత పాటే పాడటం సబబు కాదని అన్నారు.

ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే అవహేళనగా, వెటకారంగా కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతోందని విమర్శించిన ఆయన, వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ గెలిచినా మద్దతిస్తారనే ధైర్యంతో పాటు జాతీయపార్టీలకు ప్రాంతీయ పార్టీలు మద్దతివ్వాల్సిందేనన్న ధోరణితో బీజేపీ ఉందని ఉండవల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Undavalli
Andhra Pradesh

More Telugu News