Chandrababu: విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఈ ముగ్గురిపైనా ఉంది: వైవీ సుబ్బారెడ్డి

  • బీజేపీ, టీడీపీ రెండూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేశాయి
  • నాడు మోదీ హామీ ఇచ్చిన సమయంలో చంద్రబాబు, పవన్ ఉన్నారు
  • మీడియాతో వైసీపీ నేత సుబ్బారెడ్డి
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే స్పష్టంగా చెప్పిందని, అందుకే, ప్రత్యేక ప్యాకేజ్ కు చంద్రబాబు ఒప్పుకున్నారని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీపై నాడు కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుందని, ఆ నిర్ణయాన్ని అమలు చేయాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

బీజేపీ, టీడీపీ రెండూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేశాయని, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తామని నాడు మోదీ ప్రకటించిన సమయంలో చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా అక్కడే ఉన్నారని, ఆ హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఈ ముగ్గురిపైనా ఉందని సుబ్బారెడ్డి అన్నారు.
Chandrababu
Pawan Kalyan
YV Subba Reddy

More Telugu News