Rajinikanth: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలోనూ ఎంట్రీ ఇచ్చి తొలి పోస్టులు చేసిన రజనీకాంత్

  • సోషల్ మీడియా ద్వారా యువతకు దగ్గర కావాలనుకుంటోన్న రజనీ
  • వణక్కం (నమస్కారం) అంటూ ఫేస్‌బుక్‌లో మొదటి పోస్ట్
  • ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘హలో నేను ఇక్కడున్నా... అందరికీ చెప్పండి’ అని పేర్కొన్న తలైవా
రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినీనటుడు ర‌జ‌నీకాంత్ సోష‌ల్ మీడియా ద్వారా కూడా యువ‌త‌ను ఆక‌ర్షించాల‌ని చూస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌కు ట్విట్ట‌ర్ అకౌంట్ ఉన్న విష‌యం తెలిసిందే. ట్విట్ట‌ర్‌లో ఆయనకు నాలుగున్నర మిలియన్లకు మించి ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. వణక్కం (నమస్కారం) అంటూ ఫేస్‌బుక్‌లో మొదటి పోస్ట్ చేశారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘హలో నేను ఇక్కడున్నా... అందరికీ చెప్పండి’ అని పేర్కొన్నారు. ఈ రెండింటిలోనూ అప్పుడే రజనీకాంత్‌కి భారీగా ఫాలోవర్లు యాడ్ అయ్యారు.

కాగా, రాజకీయ రంగ ప్రవేశం చేసిన రజనీకాంత్ వెబ్‌సైట్‌ ద్వారా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత ఇటీవలే తొలిసారిగా చెన్నైలో రజనీకాంత్ ఓ కార్యక్రమంలో పాల్గొని తాను ఎంజీఆర్ లేని లోటును భర్తీ చేస్తానని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన పార్టీ పేరును ప్రకటిస్తారని తెలుస్తోంది.  
Rajinikanth
Twitter
Instagram
Facebook
Tamilnadu

More Telugu News