ఆ స్కూళ్లలో వారానికోసారి పుస్తకాల మోతకు సెలవ్...!
- సౌత్ ఢిల్లీ స్కూళ్లలో వారంలో ఓ రోజు 'బ్యాగ్‌లెస్ డే'
- విద్యార్థులకు క్విజ్లు, క్రీడలు, పజిళ్ల సాధన
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు యోచన
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రకాలుగా రాణించేందుకు ఈ ప్రయత్నం దోహదం చేయగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ 'బ్యాగురహిత' రోజున ఎలాంటి కార్యకలాపాలను చేపట్టాలనే దానిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని ఆమె చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేస్తామని ఆమె చెప్పారు. కాగా, సౌత్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 581 స్కూళ్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.