త్రిపురలో గెలవగానే లెనిన్ విగ్రహాన్ని కూల్చేసిన బీజేపీ శ్రేణులు... వీడియో చూడండి!
- త్రిపుర ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కూటమి
- పాతికేళ్ల తరువాత అధికారానికి దూరమైన వామపక్షాలు
- లెనిన్ విగ్రహం కూల్చివేతపై విమర్శలు
- మాణిక్ రాజీనామా చేసిన మర్నాడే ఘటన
ఐపీఎఫ్టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర)తో కలసి 59 అసెంబ్లీ స్థానాలకుగాను 43 స్థానాలను బీజేపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ట్రైబల్స్ కు రిజర్వ్ చేసిన 20 అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్నింటినీ ఈ కూటమి గెలుచుకోవడం గమనార్హం. అధికార సీపీఎం 15 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. లెనిన్ విగ్రహం కూల్చివేతపై వామపక్ష సంఘాలు మండిపడ్డాయి. బీజేపీ మార్క్ పాలన అప్పుడే మొదలైందని విమర్శించాయి. లెనిన్ విగ్రహాన్ని కూల్చుతున్న దృశ్యాలను వార్తాసంస్థ 'ఏఎన్ఐ' వెలుగులోకి తెచ్చింది. దాన్ని మీరూ చూడవచ్చు.