upasana kamineni: 'రంగస్థలం'పై స్పందన కోసం చిట్టిబాబు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు: ఉపాసన

  • సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఉపాసన
  • భర్తకు సంబంధించిన పోస్టులతో ఆకట్టుకునే ఉపాసన
  • ఈ నెల 30న విడుదల కానున్న రంగస్థలం
ఈ నెల 30న ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోనని తన భర్త ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని సినీ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన తెలిపింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఉపాసన తన భర్తకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటుంది.

సుకుమార్ దర్శకత్వంలో చరణ్‌ నటిస్తున్న ‘రంగస్థలం’ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చరణ్‌ ‘చిట్టిబాబు’గా, సమంత ‘రామలక్ష్మి’గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన నేపథ్యంలో స్పందించిన ఉపాసన... ‘చిట్టిబాబు’ మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాడని వ్యాఖ్యానించింది. అలాగే, ‘చిట్టిబాబు’ గెటప్‌ లో ఉన్న చరణ్‌ తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో ఉపాసన పంచుకుంది. 

More Telugu News

upasana kamineni
ramcharan
rangastalam