ఆ కార్యక్రమానికి తప్పకుండా వస్తాను సార్ అంది.. శ్రీదేవి సంతాప సభలో కృష్ణంరాజు భావోద్వేగం
- సుబ్బరామిరెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో శ్రీదేవి సంతాప సభ
- శ్రీదేవితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కృష్ణంరాజు
- శ్రీదేవి మళ్లీ పుడితే తప్ప ఆ లోటు భర్తీ కాదన్న నరేష్
మరో సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ తెలుగింటి అందాల ఆడపడుచు చెప్పకుండానే వెళ్లిపోయిందని అన్నారు. మళ్లీ తనే పుడితే తప్ప శ్రీదేవి లోటును మరెవరూ భర్తీ చేయలేరని అన్నారు. తామిద్దరం బాల్య స్నేహితులం మాత్రమే కాదని, మంచి స్నేహితులం కూడా అని పేర్కొన్నారు. ఆమె చనిపోయిందని చెబుతూ మెసేజ్‌లు వస్తున్నా అంగీకరించేందుకు తన మనసు అంగీకరించలేదని అన్నారు. ముంబై వెళ్లే ధైర్యం లేక ఆమెను కడసారి చూడలేకపోయానని పేర్కొన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ ఆమె మరణవార్త తెలిసి షాకయ్యానని, దేవతలు కూడా చనిపోతారా? అని అనుకున్నానని అన్నారు. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.