‘లెఫ్ట్ నాట్ రైట్’.. లెఫ్ట్ పార్టీలకు దేశంలో చోటులేదు: అమిత్ షా
- కాంగ్రెస్ కునారిల్లుతోందన్న విషయం అర్థమైంది
- మోదీపై ఈశాన్య ప్రజలకు అచంచల విశ్వాసం
- త్రిపురలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది
- త్రిపురలో విజయం అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడి వ్యాఖ్యలు
మోదీ నాయకత్వంపై ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అచంచల విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ రోజురోజుకు కునారిల్లుతోందని, తాజా ఎన్నికల్లో అది నిరూపితమైందని అన్నారు. త్రిపురలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. త్రిపుర, నాగాలాండ్‌లో చాలామంది కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. ‘దేశంలోని ఏ ప్రాంతంలోనూ లెఫ్ట్‌కు చోటు లేదన్న విషయం ఈ ఎన్నికలతో తేలిపోయిందన్నారు.