హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు శుభవార్త
- వర్క్ పర్మిట్లపై నిర్ణయం జూన్‌కి వాయిదా
- హెచ్1-బీ, హెచ్-4 వీసాదారుల భాగస్వాములకు తాత్కాలిక ఊరట
- వాయిదా నిర్ణయంపై భారత వృత్తి నిపుణుల ఆనందం
కాగా, అంతకుముందు అమెరికా హోం శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ-డీహెచ్ఎస్) ఈ వర్క్ పర్మిట్లపై గతనెల 28 కల్లా ఓ నిర్ణయం తీసుకోవాలని భావించింది. కానీ, సమీక్షలో జాప్యం కారణంగా దీనిపై నిర్ణయాన్ని జూన్ నెలకు వాయిదా వేసింది. ఇది తప్పకుండా మనదేశానికి చెందిన వృత్తి నిపుణులకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హెచ్1-బీ ప్రోగ్రామ్ అనేది విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ వీసాలను ఉపయోగించుకుంటున్న వారిలో భారతీయులే అధికులు. తర్వాతి స్థానంలో చైనా ఉంది.