geetha singh: మంచు ఫ్యామిలీ చేసిన మేలు మర్చిపోలేను: హాస్యనటి గీతా సింగ్

  • మా ఫాదరూ .. బ్రదరూ లేరు 
  • బ్రదర్ ఇద్దరు పిల్లలను నేనే చూసుకుంటాను
  • మంచు ఫ్యామిలీ ఎంతో సాయం చేసింది  
హాస్యనటిగా ప్రేక్షకులకు 'కితకితలు' పెట్టేసే గీతాసింగ్ తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడారు. తన కుటుంబంలో చోటుచేసుకున్న ఒక విషాదం గురించి ఆమె ప్రస్తావించారు. " మా ఫాదరూ .. బ్రదరూ ఇద్దరూ చనిపోయారు .. దాంతో మా బ్రదర్ ఇద్దరు అబ్బాయిలను నేనే చూసుకుంటున్నాను. పెద్దబ్బాయికి తిరుపతిలో మోహన్ బాబుగారి స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్".

"ఒకసారి షూటింగ్ సమయంలో మంచు విష్ణుతో మాట్లాడుతూ విషయం చెప్పాను.  అప్పటి నుంచి మంచు విష్ణుకి నేనంటే ఎంతో గౌరవం. నేను ఎక్కడ కనిపించినా ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాడు. నిజం చెప్పాలంటే నన్ను పట్టించుకుని పలకరించవలసిన అవసరం ఆయనకు లేదు. ఆయన కారణంగానే మా అన్నయ్య కొడుక్కి తిరుపతిలోని మోహన్ బాబు స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కి అవకాశం లభించింది. పిల్లల విషయంలో ఈ రోజున ఇంత హ్యాపీగా వున్నాను అంటే అందుకు మంచు ఫ్యామిలీ కారణం" అంటూ చెప్పుకొచ్చారు.     
geetha singh

More Telugu News