jaggn: వైసీపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారో తెలిసింది: జగన్

  • ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించాలి
  • హోదా కోసం ఎంపీల పోరాటం కొనసాగుతుంది
  • ఎవరూ వేలెత్తి చూపని విధంగా రాజకీయాలు చేస్తాం
పార్టీ  మారడానికి వైసీపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారో తన దృష్టికి వచ్చిందని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని... అంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అసెంబ్లీకి వెళతామని తెలిపారు. విభజన హామీలను సాధించడం కోసం తమ ఎంపీలు చేస్తున్న పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

ఎంపీల పోరాటానికి నాయకులంతా మద్దతు తెలపాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే ఎవరూ వేలెత్తి చూపని విధంగా రాజకీయాలు చేస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లా తాళ్లూరులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈరోజు జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైవ్యాఖ్యలు చేశారు. 
jaggn
YSRCP
Special Category Status

More Telugu News