కేటీఆర్ రాసిన లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి
- తెలంగాణలో పసుపు బోర్డు స్థాపించాలని ఇటీవల కేటీఆర్ లేఖ
- స్పైసెస్ బోర్డ్ ఆఫీసులో తెలంగాణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం: సురేశ్ ప్రభు
- పసుపు కోసం ప్రత్యేకంగా ఒక స్పైసెస్ పార్క్ ఏర్పాటుకు సహకరిస్తాం
పసుపు పంట మార్కెటింగ్, రీసెర్చ్ ద్వారా పంట అభివృద్ది చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రాల వ్యవసాయ శాఖలపైన ఉంటుందని తన లేఖలో తెలిపిన కేంద్ర మంత్రి... స్పైసెస్ బోర్డు ద్వారా పసుపుతో పాటు ఇతర స్పైసెస్ ఎగుమతులు, నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణ వంటి కార్యక్రమాలను పర్యవేక్షించేలా చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం ప్రత్యేక సెల్ ను స్పైసెస్ బోర్డులో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ (TIES) కింద పసుపు కోసం ప్రత్యేకంగా ఒక స్పైసెస్ పార్క్ కూడా నెలకొల్పుతామని ఆయన లేఖలో పేర్కొన్నారు.