కేసీఆర్ పై దొంగనోట్లు, దొంగ పాస్ పోర్టు కేసులున్నాయ్.. కేటీఆర్ ఓ బ్రోకర్: కోమటిరెడ్డి ఫైర్
- బ్లాక్ టికెట్లను అమ్ముకున్న చరిత్ర కేసీఆర్ ది
- తండ్రి, కొడుకు, కూతురు కలసి 10 వేల కోట్లు దోచుకున్నారు
- కేసీఆర్, కేటీఆర్ లు జైలుకెళ్లడం ఖాయం
మియాపూర్, జీడిమెట్ల భూకుంభకోణాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆధారాలతో సహా బయటపెడతామని కోమటిరెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి అధికారం పోగానే... కేసీఆర్, కేటీఆర్ లు జైలుకు పోవడం ఖాయమని చెప్పారు. మోదీ, రాహుల్ గాంధీలను కేసీఆర్ నోటికొచ్చినట్టు దూషిస్తుంటే... జానారెడ్డిని కేటీఆర్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ పై గతంలో నకిలీ నోట్ల కేసు, దొంగ పాస్ పోర్టుల కేసులున్నాయని... బ్లాక్ టికెట్లను అమ్ముకున్న చరిత్ర ఆయనదని కోమటిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి ఆస్తులపై విచారణ జరిపించి, ఈడీ కేసులను పెడతామని హెచ్చరించారు.