కమలహాసన్ పార్టీకి సభ్యత్వాల వెల్లువ
- 48 గంటల్లోనే రెండు లక్షలకు పైగా సభ్యుల చేరిక
- వారిలో ఓటర్లెంతమందో తెలియని వైనం...!
- పార్టీ ఆవిష్కరణ రోజే వెబ్సైట్ ప్రారంభం
భారత్తో పాటు అమెరికా, యూఏఈ, సింగపూర్, యూకే, మలేసియా, సౌదీ అరేబియా, కెనడా లాంటి దేశాల నుంచి కూడా పార్టీ వెబ్సైట్ ద్వారా పార్టీలో సభ్యత్వం తీసుకున్నారని ఆయన చెప్పారు. కాగా, ఈ నెల 21న మధురైలో కమల్ తన రాజకీయ పార్టీని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి 7.27 గంటలకు ఈ వెబ్సైటును ప్రారంభించారు. అయితే తాజాగా సభ్యత్వం తీసుకున్న వారిలో తమిళనాడు రాష్ట్రంలో ఓటు హక్కు ఎంత మందికి ఉందన్న సంగతి మాత్రం తెలియడం లేదు.