నేటి నుంచి వ్యాలెట్లకు పరిమితులు... పూర్తి స్థాయిలో పనిచేయకపోవచ్చు
- పూర్తి కేవైసీ మినహాయింపులకు గడువు సమాప్తం
- నేటి నుంచి వ్యాలెట్లలో నగదు నింపుకోవాలంటే కేవైసీ ఇవ్వాల్సిందే
- అమల్లోకి వచ్చిన ఆర్ బీఐ ఆదేశాలు
కానీ వ్యాలెట్ల నుంచి బ్యాంకుకు, ఇతరులకు నగదు బదిలీలకు అవకాశం లేదు. అలాగే, తాజాగా ఈ వ్యాలెట్లలో మనీ లోడ్ చేసుకునేందుకు కూడా వీలుండదు. అయితే, పేటీఎం ఈ రోజు కూడా క్యాష్ లోడ్ చేసుకునేందుకు అనుమతిస్తూనే ఉంది. మొబిక్విక్ మాత్రం ఆధార్ నంబర్, పేరు వివరాలు ఇవ్వడం ద్వారా పూర్తి కేవైసీ పూర్తి చేస్తేనే బ్యాలెన్స్ యాడ్ చేసుకునేందుకు అనుమతిస్తోంది. ఇతరులకు ఆ అవకాశాన్ని నిలిపివేసింది. పూర్తి కేవైసీ వివరాలు ఇవ్వకపోయినా రూ.10,000 వరకు లోడ్ చేసుకునేందుకు అనుమతించాలని కంపెనీలు కోరినప్పటికీ ఆర్ బీఐ నో చెప్పేసింది. ప్రతీ చెల్లింపుల సాధనం కేవైసీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది.