ఎయిర్ సెల్ కస్టమర్లకు ఊరట... చేరి 90 రోజులు అవకపోయినా పోర్టింగ్ కు అవకాశం
- పలు సర్కిళ్లలో సేవలు నిలిపివేత
- ఇతర సర్కిళ్లలోనూ కస్టమర్లకు ఇబ్బందులు
- నివేదికకు ఆదేశించిన ట్రాయ్
- కస్టమర్లు సులభంగా బయటకు వెళ్లేందుకు అవకాశం
ఎయిర్ సెల్ కు 8 కోట్ల కస్టమర్లు ఉన్నారు. తీవ్ర నష్టాల కారణంగా సేవలను నిలిపివేయాలని ఈ సంస్థ నిర్ణయించిన విషయం తెలిసిందే. గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ (వెస్ట్) సర్కిళ్లలో గత నెల 31 నుంచే సేవలు ఆపేస్తున్నట్టు తెలిపింది. అయితే, ఇతర రాష్ట్రాల్లోని కస్టమర్లకు సైతం ఎయిర్ సెల్ నెట్ వర్క్ పరిధిలో సమస్యలు ఎదురవుతుండడం ట్రాయ్ దృష్టికి వచ్చింది. దీంతో తాజా ఆదేశాలు జారీ చేసింది.