శ్రీదేవి మృతితో పలు సినిమాల షూటింగులు రద్దు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీదేవి మృతితో పలు సినిమాల షూటింగులు రద్దు!

  • అమితాబ్-రిషికపూర్ ‘102 నాట్ ఔట్’ చిత్రం షూటింగ్ రద్దు
  • శ్రీదేవి అకాల మరణ వార్త చాలా బాధించిందన్న ఉమేశ్ శుక్లా
  • ఈ ఏడాది హోలీ పండగ నిర్వహించుకోం: షబానా ఆజ్మీ
ప్రముఖ నటి శ్రీదేవి కన్నుమూతతో బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ తో పాటు ఈరోజు జరగాల్సిన పలు కార్యక్రమాలు కూడా రద్దయినట్టు సమాచారం. అమితాబ్-రిషికపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘102 నాట్ ఔట్’ చిత్రం షూటింగ్ రద్దు అయింది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు ఉమేశ్ శుక్లా  మీడియాతో మాట్లాడుతూ, మన లెజెండరీ నటి శ్రీదేవి అకాల మరణం తనను చాలా బాధించిందని, ఆమెకు సంతాపం తెలుపుతూ ఈరోజు జరగాల్సిన తమ సినిమా పాట షూటింగ్ ను రద్దు చేసుకున్నామని, శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.

ఈ సినిమాతో పాటు ఇంకా పలు సినిమాల షూటింగ్ లు రద్దయినట్టు సమాచారం. కాగా, సీనియర్ నటి షబానా ఆజ్మీ మాట్లాడుతూ, శ్రీదేవి మరణ వార్త తమను కుంగదీసిందని చెప్పారు. ప్రతి ఏడాది తన భర్త జావేద్ అక్తర్ ఎంతో ఘనంగా నిర్వహించే హోలీ పండగను ఈ ఏడాది నిర్వహించడం లేదని ఆమె తెలిపారు.   
Sridevi
Bollywood

More Telugu News