YSRCP: మేము రాజీనామా చేస్తాం.. టీడీపీ ఎంపీలు మాతో కలిసిరావాలి: వైసీపీ ఎంపీలు

  • ఏప్రిల్‌ 6న రాజీనామా 
  • మాతో పాటు రాజీనామా చేసి చిత్తశుద్ధి చాటుకోవాలి
  • ప్రత్యేక హోదాపై చంద్రబాబు రోజుకో మాట చెబుతున్నారు
  • ఎంపీలు మిథున్‌రెడ్డి, వరప్రసాద్
ఆంధ్ర‌ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తాము ఏప్రిల్‌ 6న లోక్ సభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వరప్రసాద్ మరోసారి స్పష్టం చేశారు. ఈ రోజు వారు మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ ఎంపీలు తమతోపాటు రాజీనామా చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని అన్నారు. ప్రత్యేక హోదాపై రోజుకోలా మాట్లాడుతోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతున్నార‌ని, ఈ తీరు స‌రికాద‌ని విమ‌ర్శించారు.
YSRCP
Union Budget 2018-19
Special Category Status
Telugudesam
midun reddy

More Telugu News