south korea: అమెరికాతో చర్చలకు సిద్ధం: సంచలన ప్రకటన చేసిన ఉత్తరకొరియా

  • ఆంక్షలు విధిస్తే దానిని యుద్ధంగా పరిగణిస్తామన్న ఉ.కొరియా 
  • బెదిరింపులకు తలొగ్గని అమెరికా, ఆంక్షల విధింపు
  • వెంటనే చర్చలకు సిద్ధమంటూ ప్రకటన
ఉత్తరకొరియాపై ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలు సత్ఫలితాలను ఇచ్చేలా కనిపిస్తున్నాయి. అమెరికా ఆంక్షలు విధిస్తే దానిని తాము యుద్ధంగా పరిగణిస్తామని ప్రకటించిన ఉత్తరకొరియా... ఆ కాసేపటికే ఆ దేశంతో చర్చలకు సిద్ధమని ప్రకటించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. దక్షిణ కొరియాలో నిర్వహించిన వింటర్‌ ఒలింపిక్స్‌ క్రీడల ముగింపు ఉత్సవానికి వచ్చిన ఉత్తరకొరియా ప్రత్యేక బృందం... అమెరికాతో సంబంధాలపై స్పందిస్తూ, శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది.

 అంతేకాకుండా, ఈ బృందం ఒలింపిక్‌ సిటీలో ఎవరికీ తెలియని చోట దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ తో సమావేశమైంది. ఈ సమయంలో అమెరికాతో కయ్యానికి కాలుదువ్వకుండా సామరస్యంగా ముందుకెళ్లాలని ఆయన వారికి సూచించినట్టు తెలుస్తోంది. కాగా, వింటర్ ఒలింపిక్స్‌ ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు బాగా పనిచేసినట్లు అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.  
south korea
North Korea
USA

More Telugu News