నదుల ప్రక్షాళనకు రూ.10 లక్షల కోట్లు అవసరం: కేంద్ర మంత్రి గడ్కరీ
- ప్రైవేటు సంస్థల నుంచి రూ.4 లక్షల కోట్లు తీసుకుంటున్నాం
- కేంద్రం ఒక్కటే ఈ పనిచేయలేదు
- రాష్ట్రాలు, కార్పొరేట్ల సాయం కూడా అవసరమే
‘‘కేంద్రం ఒక్కటే ఈ పని చేయలేదు. రాష్ట్రాలు, కార్పొరేట్లు, స్థానిక సొసైటీలు, పౌరుల సాయం కూడా అవసరమే. కార్పొరేట్ల సామాజిక బాధ్యత కార్యక్రమంతోపాటు, తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సంస్థలు ఉన్నాయి’’ అని గడ్కరీ అన్నారు. ఈ బైకులు, ఈ ట్యాక్సీలను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు మంత్రి చెప్పారు. వీటితో కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు తక్కువ ధరలకే రవాణా సాధ్యపడుతుందన్నారు.