angarang papon mahanta: 'ముద్దు' ఘటనలో సింగ‌ర్‌ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

  • అంగారగ్ పపోన్ మహంతపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
  • ఇండియా కిడ్స్‌ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన పపొన్ 
  • షోలో 11 ఏళ్ల బాలిక పెదాలపై ముద్దుపెట్టడంతో వివాదం 
ఇండియా కిడ్స్‌ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన అంగారగ్ పపొన్ మహంత ఆ షోలో 11 ఏళ్ల బాలిక పెదాలపై ముద్దుపెట్టిన ఘటన సోషల్ మీడియాలో పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది రునా భుయాన్‌ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో సింగర్ పపొన్‌ పై ఫిర్యాదు చేశారు. మరోపక్క, శిశు హక్కుల పరిరక్షణ సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సింగర్ పపొన్ పై పోక్సో చట్టంలోని సెక్షన్ 10, 21 ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు తూర్పు గువహటి డీసీపీ మోహనీష్ మిశ్రా తెలిపారు. 
angarang papon mahanta
papon
singer
kiss case

More Telugu News