mohan babu: విష్ణును ఆర్టిస్ట్ చేయాలనుకోలేదు .. అతనే ఉత్సాహం చూపించాడు: మోహన్ బాబు

  • విష్ణును బాగా చదివించాలనుకున్నాను 
  • మనోజ్ ను ఆర్టిస్టును చేయాలనుకున్నాను 
  • కానీ విష్ణుకు నటనపైనే ఆసక్తి వుంది
తాజాగా ఐ డ్రీమ్స్ తో మోహన్ బాబు మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. చిత్రపరిశ్రమలో  హీరోలు తమ తనయులను .. హీరోయిన్లు తమ కూతుళ్లను ప్రోత్సహిస్తారనే విషయాన్ని ఆయన ఖండించారు. "మా అమ్మాయి నటించింది కదా ..  ఫస్టు సినిమాతోనే శభాష్ అనిపించుకుంది .. అవార్డు కూడా తెచ్చుకుంది".

"ఇక విష్ణును ఐపీఎస్ చదవమని చెప్పాను .. ఇంజనీరింగ్ లో అతను ఫస్టు క్లాస్ స్టూడెంట్. .. బాస్కెట్ బాల్ నేషనల్ ప్లేయర్ కూడా. అందువలన విష్ణును ఐపీఎస్ చేయించి .. మనోజ్ ను ఆర్టిస్ట్ ను చేద్దామనుకున్నాను. కానీ తనకి నటనపైనే ఇష్టం ఉన్నట్టు విష్ణు వాళ్ల అమ్మకి చెప్పాడు .. దాంతో నీ ఇష్టం అన్నాను. అంతేగానీ నా తరువాత నా వంశంలో ఉన్నవాళ్లు ఆర్టిస్టులు కావాలని ఎప్పుడూ అనుకోలేదు" అంటూ చెప్పుకొచ్చారు. 
mohan babu
vishnu

More Telugu News