భూమిని రోజుకు 15 సార్లు చుట్టేసే ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన ఫాల్కన్-9
- ఫాల్కన్-9 తో మూడు ఉపగ్రహాలను రోదసీలో ప్రవేశపెట్టిన స్పేస్ ఎక్స్ సంస్థ
- మూడు ఉపగ్రహాల్లో ఒకటి స్పెయిన్ కు చెందిన పీఏజెడ్
- పీఏజెడ్ లోని అధునాతన రాడార్ తో వేగవంతమైన, సమర్థవంతమైన ఇంటర్నెట్ సేవలు
పీఏజెడ్ ఉపగ్రహంతో పాటు ఫాల్కన్-9 స్పేస్ ఎక్స్ కు చెందిన మరో రెండు ప్రయోగాత్మక ఉపగ్రహాలను రోదసీలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని స్పేస్ ఎక్స్ కాలిఫోర్నియాలోని వాండెన్ బర్గ్ వైమానిక స్థావరం నుంచి నిర్వహించింది. ప్రయోగం నిర్వహించిన 11 నిమిషాలకు పీఏజెడ్ ఉపగ్రహాన్ని ఫాల్కన్-9 రాకెట్ కక్ష్యలో ప్రవేశపెట్టిందని స్పేస్ ఎక్స్ తెలిపింది. ఈ పీఏజెడ్ ఉపగ్రహం 24 గంటల్లో ప్రపంచం మొత్తాన్ని కవర్ చేస్తుందని, వాణిజ్య ప్రభుత్వ అవసరాలను తీరుస్తుందని స్పేస్ ఎక్స్ సంస్థ వెల్లడించింది.