టెలికం రంగంలో సరికొత్త అధ్యాయం: భారత్‌లో 5జీ ట్రయల్ సక్సెస్.. సెకనుకు 3జీబీ డేటా!
- చైనా మొబైల్ మేకర్ హువేయితో చేతులు కలిపిన ఎయిర్టెల్
- మనేసర్‌లో నిర్వహించిన 5జీ నెట్వర్క్ ట్రయల్ విజయవంతం
- ఇక 5జీ నెట్వర్క్ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్టు ప్రకటించిన ఎయిర్టెల్
గురుగ్రామ్‌లోని మనేసర్‌లో ఉన్న ఎయిర్టెల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ట్రయల్ నిర్వహించినట్టు ఎయిర్టెల్ పేర్కొంది. టెస్ట్ విజయవంతం కావడంతో త్వరలోనే భారత్‌లో 5జీ ఈకో సిస్టం అభివృద్ధికి చర్యలు ప్రారంభిస్తామని భారతీ ఎయిర్టెల్ డైరెక్టర్ (నెట్వర్క్స్) అభయ్ సావర్గోవంకర్ తెలిపారు.