Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆకట్టుకుంటోన్న 'లక్ష్మి' టీజర్ .. ప్రభుదేవా ఫ్యాన్స్ కి పండగే!

  • డాన్స్ ప్రధాన ఇతివృత్తంగా సినిమా 
  • ప్రధానమైన పాత్రలో ప్రభుదేవా
  •  దర్శకుడిగా ఎ.ఎల్. విజయ్
ప్రభుదేవా డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. డాన్స్ ప్రధాన ఇతివృత్తంగా గతంలో తెరకెక్కిన 'స్టైల్' .. 'ఏబీసీడీ' వంటి సినిమాలను ఆయన అభిమానులు మరిచిపోలేరు. అలాగే డాన్స్ ప్రధానంగా రూపొందుతోన్న మరో సినిమాతో ఆయన అభిమానులను పలకరించనున్నారు. ఓ డాన్సింగ్ లెజెండ్ .. అతని స్టూడెంట్ 'లక్ష్మి'కి సంబంధించిన కథా నేపథ్యంతో సినిమా రూపొందుతోంది.

ప్రభుదేవా కీలకపాత్రగా 'అభినేత్రి' సినిమా చేసిన ఎ.ఎల్.విజయ్ ఈ సినిమాకి దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ చేసిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. డాన్స్ ప్రధాన ఇతివృత్తం కనుక .. డాన్స్ కి సంబంధించిన దృశ్యాలపైనే ఈ టీజర్ ను కట్ చేశారు. పూర్తిస్థాయిలో ప్రభుదేవా డాన్స్ చూడాలనుకునే అభిమానుల ముందుకు ఈ సినిమా ఓ పండగలా వస్తుందనే చెప్పాలి. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయనున్నారు.
prabhudeva

More Telugu News