Telangana: సీఎం కేసీఆర్ సతీమణికి స్వల్ప అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

  • వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న శోభ
  • చికిత్స అందిస్తున్న యశోద ఆసుపత్రి వైద్యులు
  • పరామర్శించిన కేసీఆర్, హరీశ్‌రావు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సతీమణి శోభ గురువారం స్వల్ప అస్వస్థతతో హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చేరారు. వాంతులు, విరేచనాలతోపాటు ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆమెకు డాక్టర్ ఎమ్వీ రావు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నట్టు వైద్యులు తెలిపారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తదితరులు ఆసుపత్రికి చేరుకుని శోభ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.  నేడు (శుక్రవారం) డిశ్చార్జ్ చేయనున్నట్టు చెప్పారు.
Telangana
KCR
Shoba
Hospital

More Telugu News